SPORTS

అతి క‌ష్టం మీద గెలిచిన ముంబై

Share it with your family & friends

పోరాడి ఓడిన పంజాబ్ ఎలెవన్

పంజాబ్ – ఐపీఎల్ 2024లో జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు అతి క‌ష్టం మీద గెలిచింది ముంబై ఇండియ‌న్స్. 193 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఆదిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ త‌రుణంలో శ‌శాంక్ సింగ్ , అశుతోష్ శర్మ‌లు దుమ్ము రేపారు. ముంబై బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో దుమ్ము రేపారు.

గెలుపు అంచుల దాకా తీసుకు వ‌చ్చారు. ఆఖ‌రు ఓవ‌ర్ మ‌రింత ఉత్కంఠ‌ను రేపింది. 11 ర‌న్స్ కావాల్సి ఉండ‌గా 183 ప‌రుగుల వ‌ద్ద ఆఖ‌రి వికెట్ ర‌నౌట్ కావ‌డంతో క‌థ ముగిసింది. ఎట్ట‌కేల‌కు ముంబై ఇండియ‌న్స్ ఊపిరి పీల్చుకుంది.

చివ‌రి ఓవ‌ర్ దాకా ముంబై జ‌ట్టులో ఆశ‌లు స‌న్న‌గిల్లాయి. ఎప్పుడైతే అశుతోష్ శ‌ర్మ అవుట్ అయ్యాడో ఇక మ్యాచ్ త‌మ చేతిలోకి వ‌చ్చింద‌ని భావించారు. కానీ ఆఖ‌రున వ‌చ్చిన బౌల‌ర్ భారీ సిక్స్ బాద‌డంతో గెలుస్తామా లేదా అన్న అనుమానం క‌లిగింది. చివ‌ర‌కు విజ‌యం ముంబైని వ‌రించింది.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 193 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముందుంచింది. సూర్య కుమార్ యాద‌వ్ 78 ర‌న్స్ తో రెచ్చి పోతే తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ 34 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఏడు వికెట్లు కోల్పోయింది. ప‌టేల్ 31 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే క‌ర‌న్ 41 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు.