పంజాబ్ వర్సెస్ రాజస్థాన్
ఈ మ్యాచ్ అత్యంత కీలకం
అస్సాం – ఐపీఎల్ 2024లో కీలకమైన మరో లీగ్ మ్యాచ్ కు వేదిక గానుంది అస్సాం లోని గౌహతి. బుధవారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో రాజస్తాన్ రాయల్స్ లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇరు జట్లకు బిగ్ షాక్ తగిలింది. విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ తో సీరీస్ ఆడేందుకు గాను స్టార్ ఆటగాళ్లు తమ స్వదేశానికి బయలు దేరి వెళ్లారు. వారిలో రాజస్తాన్ జట్టు నుంచి జోస్ బట్లర్ ఆడడం లేదు.
ఇక ప్రస్తుత టోర్నీలో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది రాజస్థాన్ రాయల్స్. ప్రస్తుతం ఆ జట్టు 12 మ్యాచ్ లు ఆడింది. 8 మ్యాచ్ లు విజయం సాధించగా 16 పాయింట్లు సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మాత్రం తీవ్రమైన నిరాశకు లోనవుతోంది. పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉంది.
మొత్తంగా ఈ మ్యాచ్ అత్యంత కీలకం ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్. ఫస్ట్ ఆఫ్ లో 9 మ్యాచ్ లు ఆడింది 8 మ్యాచ్ లు గెలుపొందింది. తర్వాత ఆడిన మ్యాచ్ లలో చేతులెత్తేసింది. పలు మార్పులు చేయనున్నట్లు సమాచారం. ఇక పంజాబ్ కు గెలిచినా ఓడినా ఆ జట్టుకు ఒరిగింది ఏమీ లేదు. మొత్తంగా ఈ మ్యాచ్ మాత్రం శాంసన్ కు ముఖ్యం.