సన్ రైజర్స్ అదుర్స్
నితిన్ ఆల్ రౌండ్ షో
పంజాబ్ – ఐపీఎల్ 2024 లో భాగంగా ముల్లాన్ పూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ లీగ్ పోరులో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ పోరాడి ఓడింది. మార్కర్రమ్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తెలుగు కుర్రాడు నితిన్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ షో ప్రదర్శించడంతో గెలుపు దక్కింది. ఈ లీగ్ లో ఇది ఎస్ ఆర్ హెచ్ కు మూడో విజయం కావడం విశేషం.
ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే వన్ మెన్ షో చేశాడు. కేవలం 2 పరుగుల దూరంతో ఓటమి చవి చూసింది పంజాబ్ కింగ్స్ ఎలెవెన్. పంజాబ్ కుర్రాళ్లు శశాంక్ సింగ్ , అశుతోష్ శర్మ చివరి బంతి దాకా పోరాడారు. కానీ ఫలితం లేకుండా పోయింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. నితీశ్ రెడ్డి 37 బాల్స్ ఎదుర్కొని 4 ఫోర్లు 5 సిక్సర్లతో దంచి కొట్టాడు. 64 రన్స్ చేశాడు. సమద్ 12 బంతులు ఆడి 5 ఫోర్లతో 25 రన్స్ చేశాడు. ఇక అర్షదీప్ 29 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు.
పంజాబ్ పరంగా చూస్తే శశాంక్ 25 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు ఒక సిక్సర్ తో 46 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అశుతోష్ శర్మ 15 బంతులు ఆడి 3 ఫోర్లు 3 సిక్సర్లతో రెచ్చి పోయాడు 33 రన్స్ చేశాడు. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 రన్స్ మాత్రమే చేసింది.