ఎమ్మెల్సీ ఎన్నికల్లో గోపిమూర్తి విక్టరీ
8 వేల పై చిలుకు ఓట్లతో విజయం
అమరావతి – ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి ఘన విజయం సాధించారు. ఆయన ఏకంగ 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విక్టరీ నమోదు చేశారు.
గెలుపొందిన అనంతరం గోపిమూర్తి మీడియాతో మాట్లాడారు. తాను గెలుస్తానని ముందే తెలుసన్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.
టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ శాసన మండలిలో వినిపిస్తానని, తనదైన గొంతును ప్రజల తరపున మాట్లాడతానని ప్రకటించారు. ప్రత్యేకించి తనకు భారీ మెజారిటీని కట్టబెట్టినందుకు టీచర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు గోపిమూర్తి.
ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజాస్వామ్యం బతికే ఉందని నిరూపించారని, ఈ గెలుపు ప్రజాస్వామిక ఆలోచనలకు ఊపిరి పోసేలా చేసిందన్నారు. ఎవరైనా సరే తమ సమస్యలను తనతో చెప్పుకునేందుకు రావచ్చని కోరారు.