ఎమ్మెల్యేల విశ్వాసం కోల్పోయిన సీఎం
రేవంత్ రెడ్డికి స్వంత పార్టీలో చుక్కెదురు
హైదరాబాద్ – బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పనితీరు బాగో లేదంటూ పేర్కొన్నారు. ఆయన పట్ల స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో విశ్వాసం సన్నగిల్లిందని ఆరోపించారు.
తనను వారే వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. తను సీఎం కావడం మెజారిటీ ఎమ్మెల్యేలకు ఇష్టం లేదన్నారు. 64 మంది కాంగ్రెస్ నుండి గెలిస్తే అందులో కేవలం 26 మంది MLAలు మాత్రమే సిఎం కు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు రేవంత్ రెడ్డి ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అందుకు నిదర్శనమే వరంగల్ లో ఎదురైన సంఘటన అని చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుకు మాత్రమే సిఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
మిగిలిన మంత్రులపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు. కేబినెట్ లో ఇద్దరు మంత్రులు మాత్రమే ఆయన నిర్ణయాలను స్వాగతిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డిపై స్వంత పార్టీలోనే ధిక్కారం మొదలైందన్నారు.
తన వర్గాన్ని పెంచుకునేందుకే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు పెద్ది సుదర్శన్ రెడ్డి.