చంద్రబాబు ఓటమి ఖాయం
మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్
అమరావతి – ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పంలో టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓడి పోవడం తప్పదన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
గత కొంత కాలంగా కుప్పంలో అబద్దాలు చెబుతూ గెలుస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడుకు ఈసారి ప్రజలు చుక్కలు చూపించడం తప్పదన్నారు. ఏడుసార్లు అక్రమంగా విజయం సాధిస్తూ వచ్చాడని, ఈసారి కూడా మాయ మాటలు చెప్పి గెలుద్దామని ప్లాన్ చేశాడని ఆరోపించారు.
ఈసారి ఆయనను ఓడించేందుకు సర్వ శక్తులు పని చేశాయని అన్నారు. తమ సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు చేసిన గోబెల్స్ ప్రచారం వర్కవుట్ కాదన్నారు.
వైసీపీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విధంగా వై నాట్ 175 అన్నది అక్షర సత్యం కాబోతోందని చెప్పారు. వైసీపీ ఏపీలో మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.