ఆధారాలు ఉంటే నిరూపించాలి – పెద్దిరెడ్డి
మదనపల్లె ఘటనపై సవాల్ విసిరిన మాజీ మంత్రి
హైదరాబాద్ – మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నిప్పులు చెరిగారు. మదనపల్లె ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కావాలని కూటమి ప్రభుత్వం తప్పుడు కేసు బనాయించిందని ఆరోపించారు.
ఆధారాలు ఉంటే చూపాలని, నిరూపించాలని సవాల్ విసిరారు. ఆ కేసు ఎవరు దర్యాప్తు చేసినా తనకు ఇబ్బంది లేదన్నారు మాజీ మంత్రి. రాజకీయాలలో మచ్చ లేకుండా ఉన్నానని, ఆస్తుల వివరాలన్నీ పూర్తిగా ఎన్నికల అఫిడవిట్ లో తెలియ చేశానని చెప్పారు.
తొలి నుంచీ చంద్రబాబు నాయుడు తమకు వ్యతిరేకంగా ఉన్నారని, ఆయనను ఎదుర్కొని రాజకీయాలలో కొనసాగుతూ వచ్చామని, దీనిని జీర్ణించుకోలేక టార్గెట్ చేశారని ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
కొందరు కావాలని తప్పుడు ఆరోపణలు చేశారని వాపోయారు.
ఏపీ సీఎం చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. మదనపల్లె అగ్ని ప్రమాద ఘటనలో తన ప్రమేయంపై ఏ ఆధారాలు ఉన్నా చూపాలని అన్నారు.