NEWSNATIONAL

ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ తో గ్రామాలు అనుసంధానం

Share it with your family & friends

కేంద్ర మంత్రి చంద్ర‌శేఖ‌ర్ పెమ్మ‌సాని

ఢిల్లీ – ప్ర‌పంచ టెలికాం రంగంలో భార‌త దేశం విస్మ‌రించ‌లేని దేశంగా మారి పోయింద‌ని అన్నారు కేంద్ర మంత్రి డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ పెమ్మ‌సాని. ఢిల్లీలో జ‌రిగిన ప్ర‌పంచ టెలికాం స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని ప్రసంగించారు. అంత‌కు ముందు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా డాక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ పెమ్మ‌సాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాము 6,00,000 గ్రామాల‌ను అనుసంధానం చేశామ‌ని చెప్పారు. ఇది భారత దేశంలోని మొత్తం గ్రామాలలో 95 శాతం 4Gతో అనుసంధానించడం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు.

తాము ఇప్పటికే 200,000 గ్రామాలను ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఇంకా మిగిలి పోయిన‌ వాటిని 2027 నాటికి పూర్తి చేస్తామని ప్ర‌క‌టించారు. భార‌త దేశం కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో 450,000 కంటే ఎక్కువ టవర్‌లను ఇన్‌స్టాల్ చేశామ‌ని , దీని ద్వారా వేగవంతమైన 5Gని అందుబాటులోకి తీసుకు వ‌చ్చామ‌ని చెప్పారు డాక్ట‌ర్ పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్.

భారతదేశం కేవలం 3 సంవత్సరాల వ్యవధిలో ఆత్మ నిర్భర్ భారత్ కింద తన స్వంత 4G , 5G టెక్నాలజీలను అభివృద్ధి చేసిందన్నారు.