NEWSANDHRA PRADESH

పెమ్మ‌సానికి బాబు పెద్ద‌పీట

Share it with your family & friends

కేంద్ర కేబినెట్ లోకి డాక్ట‌ర్ సాబ్

అమ‌రావ‌తి – వృత్తి రీత్యా డాక్ట‌ర్. కానీ ప్ర‌వృత్తి రీత్యా రాజ‌కీయ నాయ‌కుడు. ఊహించ‌ని రీతిలో వైసీపీ స‌ర్కార్ ను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంతే కాదు ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంచిన తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు ఎంపీ సీటు కేటాయించారు.

ఈ సంద‌ర్బంగా తాజాగా ఏపీలో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేశారు. కేంద్ర కేబినెట్ లోకి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఛాన్స్ ఇచ్చారు. గుంటూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మార్చి 7, 1976లో పుట్టారు. ఆయ‌న వ‌య‌సు 48 ఏళ్లు.

18వ ఎంపీగా ప‌రా్ల‌మెంట్ లో కాలు మోప‌నున్నాడు. పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ స్వ‌స్థ‌లం బుర్రిపాలెం. వ్య‌వ‌సాయ కుటుంబం ఆయ‌న‌ది. తండ్రి హోట‌ల్ వ్యాపారం చేప‌ట్టారు. 1991లో 10వ త‌ర‌గ‌తి, 1993లో ఇంట‌ర్ చేశాడు. డాక్ట‌ర్ కావాల‌నే ల‌క్ష్యంతో ఎంసెట్ లో 27వ ర్యాంక్ పొందాడు. హైద‌రాబాద్ లోని ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో డాక్ట‌ర్ కోర్సు చేశాడు.

జాతీయ వైద్య విజ్ఞాన పోటీలో పెన్సిల్వేనియా ప్ర‌తినిధిగా ప‌ని చేశాడు. ఐదేళ్ల పాటు జాన్స్ హాష్కిన్ యూనివ‌ర్శిటీ , సినాయ్ ఆస్ప‌త్రిలో ఫిజిషియ‌న్ గా ప‌ని చేశాడు. పెమ్మసాని డల్లాస్, టెక్సాస్‌లోని భారతీయ కమ్యూనిటీలో బీమా చేయని లేదా బీమా లేని వ్యక్తులకు ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందజేస్తూ, నో-కాస్ట్ మెడికల్ క్లినిక్‌లో పనిచేశారు.

పల్నాడు ప్రాంత నివాసితులకు పదేళ్లకు పైగా ఉచిత త్రాగు నీటిని అందించడానికి సహకరించాడు సామూహిక సౌకర్యాల స్థాపన కోసం భూమిని అందించాడు. పిల్లలు , పెద్దలకు విద్యా పరమైన మద్దతు కోసం నిధులను అందించాడు .