చంద్రబాబు నాయుడుకు నమ్మకస్తుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కు తీపి కబురు చెప్పింది. ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ తో ముఖ్యమైన పదవిని అప్పగించింది. బుధవారం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాల నిర్వహణకు నాను కోఆర్డినేటర్ ను నియమించింది. రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ ను సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా క్యాబినెట్ ర్యాంక్ తో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులు ఇవాల్టి నుంచే అమలులోకి వస్తాయని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులలో. ఇదిలా ఉండగా పెందుర్తి వెంకటేశ్ నారా చంద్రబాబు నాయుడుకు నమ్మిన బంటుగా ఉన్నారు. అంతే కాదు ఆయన రాజానగరం నియోజకవర్గానికి 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. అంతే కాకుండా ప్రభుత్వ ప్రభుత్వ హామీల కమిటీకి చైర్మన్ గా కూడా పని చేశారు.