పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు
అమెరికా – ఏపీ రాష్ట్రం 2047 విజన్ దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. అమెరికాలో స్విస్ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్అండ్డీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి అనుకూల వాతావరణం ఉంటుందన్నారు. యూనిట్లు ఏర్పాటు చేసే సంస్థలకు 15 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు.
ఈ సందర్బంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రసంగించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రత్యేకించి పెట్టుబడిదారులు, కార్పొరేట్ కంపెనీల చైర్మన్లు, ఎండీలు, సీఈవోలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఈ మేరకు అందరికీ ఆమోద యోగ్యంగా ఉండేలా కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేసిందన్నారు నారా లోకేష్. మరో ఏడాదిన్నరలో భోగాపురం, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు మంత్రి.