మచిలీపట్నం ఎంపీగా సింహాద్రి
పేర్ని నాని కీలక కామెంట్స్
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో సీఎం బిజీగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్ ను ఎంపిక చేశారని చెప్పారు.
సింహాద్రి చంద్రశేఖర్ తండ్రి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నియ్యారని తెలిపారు. మచిలీపట్నంతో సింహాద్రి చంద్రశేఖర్ కు వారి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందన్నారు. గత 35 ఏళ్లుగా అంకాలజీ డాక్టర్ గా సేవలు అందిస్తూ వచ్చారని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా విశిష్ట సేవలు అందిస్తూ వచ్చారని పేర్ని నాని చెప్పారు. మచిలీపట్నం పార్లమెంట్ ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారని వెల్లడించారు. ఆయనను నియమించి జగన్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు పేర్ని నాని.
పదవుల కోసం గోడలు దూకే నేతలు ఎందరో ఉన్నారని, కానీ మీ లాంటి వ్యక్తి బరిలోకి దిగడం మంచిదని తన అభిప్రాయమని పేర్కొన్నారని ఈ సందర్బంగా చెప్పారు మాజీ మంత్రి.