టీడీపీ ప్రభుత్వం వేధింపుల పర్వం
కక్ష సాధిస్తోందన్న పేర్ని నాని
అమరావతి – ఏపీలో ప్రస్తుతం అరాచక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలని కక్ష సాధింపులకు దిగుతోందని ఆరోపించారు.
పనిగట్టుకుని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ప్రతి రోజూ దాడులకు పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు పేర్ని నాని. కక్ష సాధింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తోందని ధ్వజమెత్తారు.
అక్రమ అరెస్ట్ లు చేయడం, కేసులు నమోదు చేయడం, ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడం పరిపాటిగా మారి పోయిందన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని.
మాజీ మంత్రి జోగి రమేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ ప్రభుత్వం సీఐడీ, ఏసీబీ కేసులు నమోదు చేయించిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం తమకు ఉందని అన్నారు మాజీ మంత్రి.
అధికారం శాశ్వతం కాదని ఆ విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు పేర్ని నాని. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు.