NEWSANDHRA PRADESH

త‌ప్పుడు ప్ర‌చారం పేర్ని నాని ఆగ్ర‌హం

Share it with your family & friends

ద‌మ్ముంటే నిరూపించాల‌ని బాబుకు స‌వాల్

అమ‌రావ‌తి – మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. త‌ప్పుడు ప్ర‌చారాల‌కు టీడీపీ పెట్టింది పేర‌న్నారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప‌నిగ‌ట్టుకుని అబ‌ద్దాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ల‌డ‌మే ప‌నిగా టీడీపీ పెట్టుకుంద‌న్నారు.

ఓ వైపు రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ గ‌తి త‌ప్పింద‌ని, ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెట్ట‌కుండా కేవ‌లం నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తూ విలువైన కాలాన్ని వేస్ట్ చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

రూ. 3 కోట్ల‌కు పైగా ఎగ్ ఫ‌ఫ్ ల‌కు ఖ‌ర్చు చేశారంటూ త‌ప్పుడు కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు మాజీ మంత్రి పేర్ని నాని. రాష్ట్ర స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని, కేవ‌లం ప్ర‌చారం చేసుకుంటూ పాల‌న సాగిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, రాబోయే రోజుల్లో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో డిజైన్ చేసి వాళ్ళ జీతగాళ్ళతో సర్క్యులేట్ చేయిస్తున్నారంటూ పేర్ని నాని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ద‌మ్ముంటే ఇది నిజ‌మ‌ని నిరూపించాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు.