Tuesday, April 22, 2025
HomeNEWSANDHRA PRADESHపేర్ని కుటుంబం అరెస్ట్ ఖాయం

పేర్ని కుటుంబం అరెస్ట్ ఖాయం

మంత్రి కొల్లు ర‌వీంద్ర కామెంట్స్

అమ‌రావ‌తి – వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై నిప్పులు చెరిగారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌. పేదల బియ్యం తినేసి నీతి కబుర్లు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు. పేర్నిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రూ.90 లక్షల విలువైన 187 టన్నుల బియ్యాన్ని దోచేశారని దుయ్యబట్టారు.

పేర్ని కుటుంబం అంతా పరారీలోనే ఉందంటూ ఎద్దేవా చేశారు కొల్లు ర‌వీంద్ర‌. దొంగ అయిన నానికి పరామర్శలు విడ్డూరమన్నారు. వైసీపీ అంతా దొంగల పార్టీనే అని అర్థమవుతోందని మండిప‌డ్డారు. ఆరు నూరైనా స‌రే పేర్ని ఫ్యామిలీ జైలుకు వెళ్లాల్సిందేనని స్ప‌ష్టం చేశారు కొల్లు ర‌వీంద్ర‌.

ఇంత కాలం త‌నంత‌కు తాను గా గొప్పోడినంటూ ప్ర‌చారం చేసుకుంటూ వ‌చ్చాడ‌ని పేర్ని నానిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు విచార‌ణ‌లో అస‌లు వాస్త‌వం బ‌య‌ట ప‌డింద‌న్నారు. ఇక‌నైనా చిల్ల‌ర రాజ‌కీయాలు మానుకోవాల‌ని సూచించారు. వైసీపీ నేత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయ‌ని ఎద్దేవా చేశారు.

వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసింది చాల‌క పైపెచ్చు అమ్మ‌నా బూతులు తిడుతూ రాక్ష‌స‌, పైశాచిక ఆనందం పొందారంటూ తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు మంత్రి కొల్లు ర‌వీంద్ర‌.

RELATED ARTICLES

Most Popular

Recent Comments