NEWSANDHRA PRADESH

ఈసీ నిర్వాకం పేర్ని ఆగ్ర‌హం

Share it with your family & friends

రూల్స్ కు విరుద్దంగా చ‌ర్య‌లు

అమ‌రావ‌తి – ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని (వెంక‌ట్రామ‌య్య ) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల సంఘం ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒత్తిడి మేర‌కు తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల కూట‌మికి ల‌బ్ది చేకూరేలా చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ముఖేష్ కుమార్ మీనా వ్య‌వ‌ర‌హిస్తున్నార‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అందుకే తాము హైకోర్టును ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు.

ఎల్లో మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌ను ఆధారంగా చేసుకుని సీఈవో నిర్ణ‌యాలు తీసుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. అస‌లు ముందు వెనుకా ఆలోచించ‌కుండా ఎలా చ‌ర్య‌లు చేప‌డ‌తార‌ని పేర్నినాని ప్ర‌శ్నించారు.

ఇదిలా ఉండ‌గా తెలుగుదేశం పార్టీ చేసిన దౌర్జ‌న్యాల గురించి ప‌క్కా ఆధారాల‌తో స‌హా తాము సీఇవోకు అంద‌జేశామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు తీసుకున్న పాపాన పోలేద‌న్నారు పేర్ని నాని.