ఏపీ సర్కార్ పై పేర్ని నాని ఫైర్
కక్ష సాధింపు చర్యలు తగవు
అమరావతి – ఏపీ మాజీ మంత్రి, కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని నిప్పులు చెరిగారు. రాష్ట్ర టీడీపీ కూటమి సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. గురువారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
ఏదో రకంగా భయపెట్టి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తోందని ఆరోపించారు . ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని వైసీపీ నిర్ణయించిందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ప్రధానంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను టార్గెట్ చేసిందని, అయినా ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు పేర్ని నాని. తమ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరైనా పోలీసులు వేధించినా లేక కేసులు నమోదు చేసినా, భయ భ్రాంతులకు గురి చేసినా ఆందోళన చెంద వద్దని ఈ మేరకు న్యాయ సాయం చేసేందుకు ముగ్గురితో లీగల్ ఎక్స్ పర్ట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పేర్ని నాని.