బాబూ..వాలంటీర్లను కొనలేవు
మాజీ మంత్రి పేర్ని నాని
అమరావతి – జగన్ రెడ్డిని ఢీకొనే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నువ్వూ, నీ దత్తపుత్రుడు అమ్ముడు పోయినట్లు వాళ్లూ అమ్ముడు పోతారనుకుంటే ఎలా అని ప్రశ్నించారు.
వాలంటీర్లంటే నిస్వార్ధ సేవకులని ..వారికి గాలం వేయడం నీ తరం కాదన్నారు పేర్ని నాని. నాలుగున్నర ఏళ్లుగా మీరు పెట్టిన క్షోభంతా వాలంటీర్లు మర్చి పోయారని అనుకుంటున్నారా అని నిలదీశారు. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తివి నువ్వు కాదా అని మండిపడ్డారు.
బాంబే రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను అమ్ముతున్నారని ఆరోపణలు చేశారని, మూటలు మోసే ఉద్యోగం మీది అంటూ కించ పరిచారని, మగవాళ్లు ఇంట్లో లేకుండా తలుపులు కొడతారన్నది మరిచి పోతే ఎలా అని చంద్రబాబును టార్గెట్ చేశారు.
నీ మోసాలు , కుట్రలు, కుయుక్తులు నమ్మే వారు ఎవరూ లేరన్నారు. రాష్ట్రంలో పని చేస్తున్న 2 లక్షల 66 వేల మంది వాలంటీర్లకు జగన్ అంటే అమితమైన గౌరవం ఉందన్నారు. వాళ్లు మీ లాంటి వాళ్ల ప్రలోభాలకు లొంగి పోయే రకం కాదన్నారు పేర్ని వెంకట్రామయ్య (నాని) .