NEWSANDHRA PRADESH

బాబూ.. నీ బండారం ఇదిగో

Share it with your family & friends

నిప్పులు చెరిగిన పేర్ని నాని

అమరావ‌తి – ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న చేసిన అవినీతి అక్ర‌మాల గురించి ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు.

ఏపీ మంత్రి నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు పేర్ని నాని. నువ్వు పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న హైదారాబాద్ లో కట్టించిన పార్టీ ఆఫీస్ సంగ‌తి ఏంటి అంటూ నిల‌దీశారు. ఇది పూరిపాక, రేకుల షెడ్డా లేదంటే ఒకే గది ఉన్న స్లాబా.. దీని చరిత్ర ఏంటో చెప్పాల‌ని పేర్ని నాని డిమాండ్ చేశారు.

ఈ పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్ కి బదిలీ చేసుకున్నారుని, ఆ త‌ర్వాత రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారని ఆరోపించారు.. 2019 ఎన్నికలకు వెళ్ళే నెల ముందు జనవరిలో కూడా 3 ఆఫీసులకి స్థలం లీజుకి తీసుకున్నారని చెప్పారు.

మోసం చేయ‌డం చంద్ర‌బాబు నైజ‌మ‌ని మండి ప‌డ్డారు పేర్ని నాని. ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని ఎద్దేవా చేశారు. త‌మ‌ను , త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏమీ చేయ‌లేరంటూ స్ప‌ష్టం చేశారు. ఇక నుంచి అవాకులు , చెవాకులు పేల‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.