మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) షాకింగ్ కామెంట్స్ చేశారు. తాడేపల్లి గూడెం వేదికగా టీడీపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో జన విజయ కేతనం పేరుతో నిర్వహించిన సభపై స్పందించారు. గురువారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ , నారా చంద్రబాబు నాయుడులపై నిప్పులు చెరిగారు. ఆ ఇద్దరికీ పనీ పాట లేకుండా పోయందన్నారు. వారికి ఎంత సేపు జగన్ రెడ్డిని తిట్టడం తప్ప ఇంకో పనంటూ ఏమీ లేదన్నారు పేర్ని నాని.
సభలో ఏం చేయాలని అనుకుంటున్నారో, ఎందుకు ఓటు వేయాలని అనుకుంటున్నారో ఇద్దరు నేతలు చెప్పలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత ఒక్క జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
జగన్ మోహన్ రెడ్డి వద్ద బేరాలు అంటూ ఉండవన్నారు. పవన్ కళ్యాణ్ చేతనైంది చేసుకోవచ్చన్నారు. గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేశారని, కానీ జనం చీదరించు కున్నారని అన్నారు. తాము ఏం చెప్పామో అదే చేసి చూపించామని స్పష్టం చేశారు పేర్ని నాని.