ప్యాకేజీ స్టార్ కు అంత సీన్ లేదు
మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. ప్యాకేజీ స్టార్ కు ఎప్పుడు మూడ్ వస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు. తన ప్యాకేజీ కోసం కార్యకర్తల ముందు శల్యుడి పాత్ర పోషిస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. తల్లిని తిట్టిన వారి పల్లకీ మోస్తున్న చరిత్ర పవన్ కళ్యాణ్ దంటూ ఎద్దేవా చేశారు.
పెత్తందారీ పోకడలు కలిగిన నారా చంద్రబాబు నాయుడు కు , పవన్ కు ప్రజలు కర్ర వాచి వాత పెట్టేందుకు రెడీగా ఉన్నారని అన్నారు. గతంలో కొన్ని సీట్లయినా వచ్చాయని కానీ అవి కూడా రావన్నారు. ఇవాళ దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని స్పష్టం చేశారు.
ఇక ఇటీవలే వైసీపీని వీడిన మచిలీపట్నం ఎంపీ బాల శౌరి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనను జంపింగ్ జపాంగ్ గా అభివర్ణించారు పేర్ని నాని . బంధాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు పేర్ని నాని.
మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఇకనైనా బుద్ది తెచ్చుకుని జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని హితవు పలికారు.