కుర్చీల కోసమే కలిశారు – నాని
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. కుర్చీల కోసమే పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి కలిశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏఐసీసీ అంటే ఆల్ ఇండియా చంద్రబాబు కమిటీ అంటూ ఎద్దేవా చేశారు.
ఈ మూడు పార్టీలు గతంలో ఏం చేశాయో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు పేర్ని నాని. ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేసిందన్నారు.
తాము చేపట్టిన నవ రత్నాలు తమను తిరిగి పవర్ లోకి వచ్చేలా చేస్తాయన్నారు పేర్ని నాని. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు\కు దక్కుతుందన్నారు. తమకు 8 లక్షల కోట్ల బరువు మోపారని, ఖాళీ ఖజానా చేతికి ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి.
మూడు పార్టీలు ఎన్ని రకాలుగా కుట్రలు పన్నినా జనం నమ్మే స్థితిలో లేరని, తిరిగి జగన్ రెడ్డిని సీఎం చేయాలని డిసైడ్ అయ్యారని జోష్యం చెప్పారు.