NEWSANDHRA PRADESH

అరెస్ట్ ల‌కు భ‌య‌ప‌డం స‌ర్కార్ పై యుద్దం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పేర్ని నాని

అమ‌రావ‌తి – మాజీ మంత్రి పేర్ని నాని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేసినా, త‌మ వారితో జైళ్ల‌న్నీ నింపినా ఎక్క‌డా త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.

పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. గుంటూరు, కృష్ణ కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల‌న్నీ నింపండి..అయినా భ‌య‌ప‌డం..వెనుదిరిగే ప్ర‌స‌క్తి లేద‌న్నారు .

ఎవ‌రూ అరెస్ట్ ల‌కు భ‌య‌ప‌డే ర‌కం కాద‌న్నారు. అంద‌రూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు ముందుకు వ‌స్తార‌ని పేర్కొన్నారు పేర్ని నాని.

త‌మ వైఫ‌ల్యాల‌ను కప్పి పుచ్చుకునేందుకు లేనిపోని ఆరోప‌ణ‌లు త‌మ‌పై టీడీపీ చేస్తోంద‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. త‌ను అక్ర‌మంగా నిర్మించిన ఇంటి కోసం చంద్ర‌బాబు నాయుడు బుడ‌మేరు నీటిని వ‌దిలార‌ని, దీంతో బెజ‌వాడ నీటిమ‌యం అయ్యింద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు పేర్ని నాని.

ఇలా ఎంత కాలం వైసీపీని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతారంటూ ప్ర‌శ్నించారు మాజీ మంత్రి. ఇది భావ్యం కాద‌న్నారు. అధికారం మీ చేతుల్లోనే ఉంది విచార‌ణ‌కు ఆదేశించండి..త‌ప్పు ఎవ‌రిదో తేల్చాల‌ని అన్నారు .