పేర్ని నాని సతీమణి కేసు వాయిదా
19కి వాయిదా వేసిన కోర్టు
అమరావతి – మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు వాయిదా వేసింది కోర్టు. 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారంటూ పేర్నినాని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్ పిటిషన్ ను తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు జిల్లా జడ్జి. బెయిల్ రాక పోవడంతో నానితో పాటు భార్య గాయబ్ అయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారని సమాచారం.
ఈ కేసుకు సంబంధించి గత శుక్రవారం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది పేర్ని జయసుధ. కాగా బెయిల్ పిటీషన్ ను తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. ఇవాళ విచారణకు వచ్చింది.
ఇదిలా ఉండగా పోలీసుల నుండి సీడీ ఫైల్ రాక పోవడంతో విచారణను 19వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు ప్రధాన న్యాయమూర్తి. ఇదిలా ఉండగా గత నాలుగు రోజుల నుంచి పేర్ని నాని, జయసుధ కనిపించకుండా పోయారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.