పేర్ని నాని భార్యకు ముందస్తు బెయిల్
మంజూరు చేసిన కృష్ణా జిల్లా కోర్టు
అమరావతి – రేషన్ స్కాం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి బిగ్ రిలీఫ్ దక్కింది. పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కృష్ణా జిల్లా కోర్టు. గోడౌన్ లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఏకంగా 4 వేల టన్నులకు పైగా ప్రజలకు చెందిన రేషన్ బియ్యం మాయమైందని కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టును ఆశ్రయించారు నాని.
ఇదిలా ఉండగా ఏపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతోనే తమపై కేసులు నమోదు చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి. ఎలాంటి అవినీతి జరగలేదన్నారు. రేషన్ బియ్యానికి సంబంధించి డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు .
అయితే రేషన్ బియ్యం స్కామ్ కు సంబంధించి సీరియస్ కామెంట్స్ చేశారు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. చోరీ చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయకుండా ఎలా వదిలి వేస్తామని ప్రశ్నించారు. తప్పు చేయక పోతే ఎందుకు హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారో చెప్పాలన్నారు.