ప్రణీత్ రావు కేసులో కీలక అంశాలు
బీఆర్ఎస్ నేత ఆదేశం మేరకే చేశా
హైదరాబాద్ – తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర పోకుండా చేస్తోంది. ఇప్పటికే తన సామాజిక వర్గానికి చెందిన ఎస్ఐబీలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన చరిత్ర సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్ రావు. సిరిసిల్లలో అపార్ట మెంట్ లో దాచుకున్న ప్రణీత్ రావును చాక చక్యంగా పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు.
ఎవరికీ తెలియకుండా రహస్య స్థలం లోకి తీసుకు వెళ్లి విచారణ చేపట్టారు. ప్రణీత్ రావు నోటి నుంచి సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఈ మేరకు ఎస్ఐబీ డీఎస్పీ రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కేటీఆర్ ది డైరెక్షన్ చేశాడని ఆ మేరకే డీఎస్పీ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆరోపించారు. ఇదిలా ఉండగా తాజాగా ఎన్నికలకు ముందు కొంత మంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఒప్పుకున్నాడు ప్రణీత్ రావు.
బీఆర్ఎస్ అగ్ర నేత 100 మంది ఫోన్ నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయాలని తనను ఆదేశించినట్లు ప్రణీత్ రావు పేర్కొన్నట్లు సమాచారం. ఆనాడు ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారనే దానిపై దృష్టి పెట్టాలని ఆదేశించినట్లు టాక్.