NEWSTELANGANA

ప్ర‌ణీత్ రావుపై కేసులు న‌మోదు

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన వెస్ట్ జోన్ ఆఫీస‌ర్

హైద‌రాబాద్ – ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో గ‌త ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన స‌స్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్ర‌ణీత్ రావుకు బిగ్ షాక్ త‌గిలింది. సిరిసిల్ల‌లో అర్ధ‌రాత్రి చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నారు పంజాగుట్ట పోలీసులు. ఇందుకు సంబంధించి కీల‌క వివ‌రాలు వెల్ల‌డించింది వెస్ట్ జోన్ పోలీసులు. పబ్లిక్ సర్వెంట్ ద్వారా నేర పూరిత విశ్వాస ఉల్లంఘన నేరాలకు సంబంధించిన కేసులో డి. ప్రణీత్ రావు అరెస్ట్ చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

ఎస్ఐబీ అడిష‌న‌ల్ ఎస్పీ ర‌మేష్ ఫిర్యాదు చేశార‌ని తెలిపింది. ఈ మేర‌కు ప్ర‌ణీత్ రావుపై
243 409, 427, 201, 120బి, 34 ఐపీసీ 3 పీడీపీపీ చట్టం, 65, 66, 70 ఐటీ చట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొంది.

వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు, ఉన్న‌తాధికారుల‌, ప్ర‌తిప‌క్ష నేత‌ల ఫోన్ ల‌ను ర‌హ‌స్యంగా ట్యాపింగ్ చేయ‌డం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు ప్ర‌ణీత్ రావు. అంతే కాకుండా ఎస్ఐబీ కార్యాల‌యం నుండి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు మాయం కావ‌డం , చ‌ట్ట విరుద్దంగా ప‌ర్య‌వేక్షించ‌డం చేశాడ‌ని ఆరోపించింది.

తన వ్యక్తిగత డ్రైవ్‌ల లోకి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కాపీ చేయడం, తనకు, ఇతరులకు తప్పుడు లాభం చేకూర్చే ఉద్దేశ్యంతో ఇతరులతో కుమ్మక్కై సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేయడం చేశార‌ని ఆరోపించింది. జూబ్లీ హిల్స్ ఏసీపీ పి. వెంక‌ట గిరి ఆధ్వ‌ర్యంలోని బృందం ప్ర‌ణీత్ రావుపై విచార‌ణ చేప‌ట్టింద‌ని పేర్కొంది.