NEWSTELANGANA

రాధా కిష‌న్ రావుకు రిమాండ్

Share it with your family & friends

14 రోజులు విధించిన కోర్టు

హైద‌రాబాద్ – ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. తీగ లాగితే డొంకంతా క‌దులుతోంది. విచార‌ణ‌లో విస్తు పోయే నిజాలు వెల్ల‌డ‌వుతున్నాయి. స‌స్పెండ్ అయిన మాజీ డీఎస్పీ ప్ర‌ణీత్ రావును అరెస్ట్ చేసిన త‌ర్వాత పెద్ద తల‌కాయ‌లు బ‌య‌ట ప‌డ్డాయి.

ఇందులో ప్ర‌ధానంగా వెంక‌టేశ్వ‌ర్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిష‌న్ రావు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారంటూ వెల్ల‌డైంది. దీంతో ప్ర‌వీణ్ రావు విచార‌ణ‌లో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించ‌డం, ఈ మొత్తం టాస్క్ ఫోర్స్ వ్య‌వ‌హారం వెనుక రాధా కిష‌న్ రావు, ప్ర‌భాక‌ర్ రావు ఉన్నార‌ని చెప్ప‌డంతో విస్తు పోయారు.

ప్ర‌వీణ్ రావు అరెస్ట్ అయిన వెంట‌నే విష‌యం తెలుసుకున్న రాధా కిష‌న్ రావు, ప్ర‌భాక‌ర్ రావు జంప్ అయ్యారు. ఇత‌ర దేశాల‌కు వెళ్లారు. దీంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయ‌డంతో ఖంగు తిన్నారు. చివ‌ర‌కు హుటా హుటిన రాధా కిష‌న్ రావు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. 11 గంట‌ల‌కు పైగా ఆయ‌నను విచారించారు.

అనంత‌రం క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని కోరారు. కోర్టులో హాజ‌రు ప‌ర్చ‌డంతో రాధా కిష‌న్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆయ‌న‌ను చంచ‌ల్ గూడ జైలుకు త‌ర‌లించారు.