NEWSTELANGANA

వెంక‌టేశ్వ‌ర్ రావు రాక‌పై ఉత్కంఠ‌

Share it with your family & friends

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క సూత్ర‌ధారి
హైద‌రాబాద్ – ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో కీల‌క‌మైన సూత్రధారిగా వెంక‌టేశ్వ‌ర్ రావును భావిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న‌తో పాటు రాధా కిష‌న్ రావుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఖంగుతిన్నారు . గ‌త్యంత‌రం లేక రాధా కిష‌న్ రావు హుటా హుటిన హైద‌రాబాద్ కు వ‌చ్చారు. ఆ వెంట‌నే విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఏకంగా 11 గంట‌ల‌కు పైగా విచార‌ణ చేప‌ట్టారు.

ఎవ‌రెవ‌రి ఫోన్లు ట్యాపింగ్ చేశారనే దానిపై కూపీ లాగారు. మొత్తం ఈ వ్య‌వ‌హారానికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అంతా వెంక‌టేశ్వ‌ర్ రావు అని రూఢీ అయిన‌ట్లు టాక్. కీల‌క‌మైన నిందితుడిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావు వైద్య చికిత్స నిమిత్త‌రం అమెరికాలో ఉంటున్నాడు. గ‌త బీఆర్ఎస్ స‌ర్కార్ లో కీల‌కంగా మారారు. ఆనాటి పెద్ద‌ల‌తో స‌త్ సంబంధాలు నెరిపారు.

రాధా కిష‌న్ రావును అరెస్ట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా పోలీసుల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఆనాడు రాధా, వెంక‌టేశ్వ‌ర్ రావుల‌కు స‌పోర్ట్ గా నిలిచిన వారిపై కూడా ఫోక‌స్ పెట్టిన‌ట్లు స‌మాచారం. ఫోన్ ట్యాపింగ్ లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌ణీత్ రావు , అద‌న‌పు ఎస్పీలు భుజంగ‌రావు, తిరుప‌త‌న్న‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేర‌కు వెంక‌టేశ్వ‌ర్ రావు విచార‌ణ‌కు హాజ‌ర‌వుతారా లేదా అన్నది వేచి చూడాలి.