బిగ్ షాక్ ఇచ్చిన నరసరావుపేట పోలీసులు
అమరావతి – నటుడు పోసాని కృష్ణ మురళికి బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం రాజంపేట సబ్ జైలులో ఉన్న తనకు నరసరావుపేట పోలీసులు పిటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఐ హైమారావు ఆధ్వర్యంలో పోసానిని తరలించారు. నరసారావుపేట కోర్టులో హాజరు పర్చనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోసానిపై 153-ఎ, 504, 67 ఐటీ కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉండగా పోసాని కృష్ణ మురళి గత వైసీపీ జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రెచ్చి పోయారు. సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రత్యేకించి సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు, మంత్రి నారా లోకేష్ తో పాటు పవన్ కళ్యాణ్ ను అనరాని మాటలు అన్నారు. అంతేకాకుండా తీవ్ర స్థాయిలో రెచ్చి పోయారు.
గత నాలుగు నెలల నుంచి మౌనంగా ఉన్నారు పోసాని కృష్ణ మురళి. అయినా కూటమి సర్కార్ వెంటాడుతోంది. ప్రత్యేకించి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ జగన్ రెడ్డి.