గర్భాశయ క్యాన్సర్ నివారణకు నిధులు
ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ
న్యూఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశంలో కోట్లాది మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో బాధ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమ ముందున్న ప్రధాన లక్ష్యం ఒక్కటేనని, అది మహిళలను అనారోగ్యానికి దూరంగా ఉంచేందుకు కృషి చేయడమేనని స్పష్టం చేశారు నరేంద్ర మోదీ.
తనను బిల్ గేట్స్ కలుసుకున్న సందర్బంగా వివిధ అంశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఇది అత్యంత ప్రమాదకరమైనదిగా మారిందని పేర్కొన్నారు. ఇందుకు గాను గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్లను తయారు చేసేందుకు స్థానికంగా పరిశోధనలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.
భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నివారణకు గాను భారీగా నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు నరేంద్ర మోదీ. దేశంలోని ఆడ పిల్లలందరికీ అతి తక్కువ ఖర్చుతో టీకాలు వేయిస్తామన్నారు. వారు క్యాన్సర్ బారిన పడకుండా ఉండేలా చేస్తామన్నారు ప్రధాన మంత్రి. ఇందుకు ఎన్ని వేల కోట్లు అయినా మంజూరు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు.