NEWSNATIONAL

రైతుల ఖాతాల్లోకి రూ. 20 వేల కోట్లు – మోడీ

Share it with your family & friends

మ‌రాఠాలో మీట నొక్కిన ప్ర‌ధాన‌మంత్రి

మ‌హారాష్ట్ర – దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ దేశంలోని రైతుల‌కు తీపి క‌బురు చెప్పారు. ప్ర‌ధాన‌మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద దేశ వ్యాప్తంగా అర్హులైన రైతుల‌కు రూ. 20,000 కోట్లు జ‌మ చేయ‌నున్నారు. శ‌నివారం మ‌రాఠాలో జ‌రిగిన స‌భ‌లో సీఎం ఏక్ నాథ్ షిండేతో క‌లిసి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ బ‌ట‌న్ నొక్కి ఓకే చేశారు.

దీంతో ఆయా రైతుల ఖాతాల్లోకి నిర్దేశించిన డ‌బ్బులు జ‌మ అవుతున్నాయి. ప్ర‌తి ఏటా రైతుల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేందుకు మోడీ స‌ర్కార్ పీఎం కిసాన్ స‌మ్మాన్ నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా రైతుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంది.

ఈ ప‌థ‌కం కింద 18వ విడ‌త నుండి భార‌త దేశం అంత‌టా 9 కోట్ల 40 ల‌క్ష‌ల మంది రైతులకు ల‌బ్ది క‌ల‌గ‌నుంది. 20 వేల కోట్ల‌ను నేరుగా ఖాతాల్లోకి బ‌దిలీ చేయ‌నున్నారు. దీని వల్ల అన్న‌దాతల ఆర్థిక స్థిర‌త్వాన్ని మెరుగు ప‌రిచేలా చేయ‌నుంద‌ని స్ప‌ష్టం చేశారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ.

రైతులకు సాధికారత కల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు పీఎం. వారి సంక్షేమానికి భరోసా ఇచ్చేందుకు తిరుగులేని నిబ‌ద్ద‌త‌ను ప్ర‌దర్శిస్తుంద‌న్నారు .