మహిళలకు మోదీ ఖుష్ కబర్
నమో డ్రోన్ దీదీ పథకం శ్రీకారం
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖుష్ కబర్ చెప్పారు. ప్రధానంగా మహిళల అభ్యున్నతి కోసం తాము కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తనను కలిసిన బిల్ గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ తో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్దిలో మహిళలు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని కితాబు ఇచ్చారు. విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, టెక్నాలజీ, వ్యవసాయం, అంతరిక్ష రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టామని స్పష్టం చేశారు.
రోజు రోజుకు టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని , దీనిని ఉపయోగించు కునేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ప్రధానమంత్రి. ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.
ఇందులో భాగంగా వ్యవసాయ రంగానికి టెక్నాలజీని పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు ప్రయారిటీ పెంచుతామని తెలిపారు మోదీ. ఇందుకు సంబంధించి డ్రోన్లను వినియోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.
ఇందుకు గాను నమో డ్రోన్ దీదీ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు ప్రధానమంత్రి. టెక్నాలజీతో అనుసంధానం చేస్తూ మహిళలకు డ్రోన్ ఆపరేట్ చేసే శిక్షణ ను అందజేస్తామన్నారు మోదీ.