వాయనాడు బాధితులను ఆదుకుంటాం – పీఎం
నా హృదయం బాధతో ఉందన్న మోడీ
కేరళ – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన కేరళ లోని ప్రకృతి విలయానికి అల్లాడి పోయిన వాయనాడును సందర్శించారు. బాధితులను , కుటుంబాలను పరామర్శించారు. వారిని ఓదార్చారు.
ప్రకృతి ప్రకోపం కారణంగా దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఇది ఊహించని ఘటనగా పేర్కొన్నారు మోడీ. కొండ చరియలు విరిగి పడడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకుంది. కాలి నడకన ప్రధాన మంత్రి విపత్తు ప్రాంతాలలో పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించి నష్టంపై అంచనా వేశారు.
అనంతరం సీఎం పినరయ్ విజయన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మోడీ ప్రసంగించారు. ప్రభుత్వం నష్టం అంచనాలు పంపిన వెంటనే ప్రకృతి విపత్తు సాయం అందజేస్తామని ప్రకటించారు మోడీ.
బాధితులు చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు . వందలాది మంది సర్వస్వాన్ని కోల్పోయారని ఆవేదన చెందారు. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి.