తరలి రండి ఓటు వేయండి
పిలుపునిచ్చిన ప్రధానమంత్రి
కన్యాకుమారి – దేశ వ్యాప్తంగా శనివారం 17వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఇవాల్టితో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కేంద్ర ఎన్నికల సంఘం సుదీర్ఘ ఎన్నికల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. దీని వల్ల విలువైన సమయం వృధా కావడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి పడిందని ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈసీ ఎన్నికల నిర్వహణ పలు అనుమానాలకు తావిచ్చేలా చేసింది.
ఇదిలా ఉండగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు అన్నది ప్రజాస్వామ్యంలో కీలకమని , దానిని ప్రతి ఒక్కరు వినియోగించు కోవాలని కోరారు . ఇదిలా ఉండగా దేశంలోని 8 రాష్ట్రాలో కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు నరేంద్ర మోడీ.