బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు
అమరావతి – ఏపీ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరనున్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ శాసన సభ పక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. ఇదే సమయంలో భాగస్వామ్య పక్షాలైన జనసేన , భారతీయ జనతా పార్టీకి చెందిన అధినేతలు, గెలుపొందిన ఎమ్మెల్యేలు తమ కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడుని ఎన్నుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మూకుమ్మడిగా తీర్మానం కూడా చేశారు.
మోడీ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు ప్రముఖ దిగ్గజ సంస్థల అధినేత, ఈనాడు , ఈటీవీ చీఫ్ రామోజీరావు మరణం కారణంగా తన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు చంద్రబాబు నాయుడు.
తాజాగా ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.