రికార్డు స్థాయిలో భక్తుల స్నానాలు
ఉత్తర ప్రదేశ్ – యూపీలోని ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో బుధవారం ప్రధాని మోడీ పవిత్ర స్నానం చేశారు. ఈ సందర్బంగా పూజలు చేశారు. గంగమ్మ తల్లికి నమస్కరించారు. సరస్వతి నదుల సంగమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడం తన పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు పీఎం. మోడీతో పాటు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ కూడా పాల్గొన్నారు. పవిత్ర స్నానం చేశారు.
ఇదిలా ఉండగా మహా కుంభ మేళాకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోట్లాది మంది భక్తులు హాజరయ్యారు. ఇప్పటి వరకు ఏకంగా 15 కోట్ల మందికి పైగా భక్తులు హాజరయ్యారని, త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారని ప్రాథమిక అంచనా. గతంలో ఎన్నడూ లేని రీతిలో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో యోగి సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఇబ్బందులు రాకుండా చూసుకుంటోంది.
భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రం ఊహించని రీతిలో ఏకంగా 3 వేల రైళ్లను నడుపుతోంది దేశ వ్యాప్తంగా. గత నెల జనవరి 13న ప్రారంభమైంది మహా కుంభమేళా. ఈనెల 26 వరకు కొనసాగుతుంది.