శ్రీ కృష్ణడి జీవితం నిత్య పాఠం – మోడీ
గెలుపు సాధించాలంటే భగవద్గీత చదవాలి
న్యూఢిల్లీ – భగవానుడు శ్రీకృష్ణుడు బోధించిన గీతోపదేశం కోట్లాది మందికి మార్గ నిర్దేశనం చేస్తోందని పేర్కొన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. ఆగస్టు 26 శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఘనంగా దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రపంచాన్ని మార్చిన గొప్ప వ్యక్తులలో శ్రీకృష్ణుడు మొదటి వాడని పేర్కొన్నారు మోడీ. ఆ భగవానుడు ప్రబోదించిన గీతా పాఠం కోట్లాది మందిని ప్రభావితం చేసిందని అన్నారు. లక్షలాది మంది నిత్యం భగద్గీతను అనుసరిస్తున్నారని, అది నిత్యం పాఠంగా మారిందని కొనియాడారు ప్రధానమంత్రి.
మానవ జీవితంలో ‘గీత’ బోధనలు ప్రభావ శీలమైనవనీ, మానవుడి ప్రతి దశలోనూ కృష్ణ భగవానుడు కొలువై ఉంటారని అన్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని ప్రార్థిస్తున్నట్లు నరేంద్ర మోడీ ఒక సందేశంలో స్పష్టం చేశారు.
ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. గీతాసారంతో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించు కోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని స్పష్టం చేశారు సీఎం.
ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు అని పేర్కొన్నారు నరేంద్ర మోడీ. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘ శ్యాముని కృపా, కటాక్షం దేశంపై సదా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.