పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ఓకే
అమరావతి – కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ రాష్ట్రానికి పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ మంగళవారం తన ట్విట్టర్ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రస్తావించింది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలిపింది.
ఇదిలా ఉండగా కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు బీహార్ , పంజాబ్ రాష్ట్రాలలో 12 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి రూ. 25,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించనుందని స్పష్టం చేసింది టీడీపీ.
ఈ పార్కులు పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొంది.. వారంలోపు అనుమతులు రానున్న దీని వలన రూ. 1.5 ట్రిలియన్ పెట్టుబడులను ఆకర్షించగలవని స్పష్‌టం చేసింది. ప్రణాళికలో భాగంగా గృహ , వాణిజ్య ప్రాంతాలతో కూడిన ఈ పారిశ్రామిక నగరాలు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, దేశీయ తయారీని పెంచడం, ఉపాధిని సృష్టించేందుకు వీలవుతుందని తెలిపింది తెలుగుదేశం పార్టీ.
ఇటీవలే సిఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢిల్లీలో ప్రధాని, మంత్రులను కలిసి వచ్చారు. తరువాత లోకేశ్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు. అనంతరం ఈ ప్రకటన వెలువడడం విశేషం.