పారిశ్రామిక నగరాలకు కేబినెట్ ఆమోదం
సంచలన నిర్ణయం తీసుకున్న బీజేపీ ప్రభుత్వం
ఢిల్లీ – ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు తీపి కబురు చెప్పింది. భారత దేశ వ్యాప్తంగా 12 కొత్త పారిశ్రామిక నగరాలకు కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
కొత్తగా ఆమోదించిన పారిశ్రామిక నగరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 పారిశ్రామిక నగరాలు, బీహార్ రాష్ట్రానికి ఒక పారిశ్రామిక నగరం ఆమోదించింది. ఇదిలా ఉండగా 12 ప్రాజెక్టుల విలువ రూ. 28,602 కోట్లకు ఓకే చెప్పడం విశేషం.
అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది. నోయిడా నమూనాకు ఇది అద్దం పడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆమోదం తెలిపిన పారిశ్రామిక నగరాలు భారత దేశ పారిశ్రామిక రంగం రూపు రేఖలు మార బోతున్నాయని స్పష్టం చేశారు.
పారిశ్రామిక నగరాలు గనుక పూర్తి అయితే భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని ప్రకటించారు. 10 లక్షల మందికి ప్రత్యక్షంగా , 30 లక్షల మందికి పరోక్షంగా జాబ్స్ వస్తాయని తెలిపారు.