యోగాతో జీవితం ఆనందం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
జమ్మూ కాశ్మీర్ – యోగా అన్నది జీవితాన్ని రాగరంజితం చేస్తుందని చెప్పారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఆయన ప్రధానమంత్రిగా కొలువు తీరి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ముచ్చటగా మూడోసారి దేశానికి పీఎం అయ్యారు. ఇది భారత దేశ చరిత్రలో మరిచి పోలేని మైలు రాయి ఆయన జీవితంలో.
ఇక నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత యోగాకు ప్రాచుర్యం తీసుకు వచ్చేందుకు ఎనలేని కృషి చేశారు. ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న జరుపుకుంటారు. ఈ సందర్బంగా ఇవాళ యోగా దినోత్సవాన్ని దేశమంతటా ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా పీఎంగా కొలువు తీరిన తర్వాత అధికారిక స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జమ్మూ కాశ్మీర్ కు వెళ్లారు. అక్కడ వేలాది మంది మహిళలు, పురుషులు, వృద్దులు, చిన్నారులతో కలిసి యోగా డేను నిర్వహించారు.
ఈ సందర్బంగా వారితో సెల్ఫీ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మోడీ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.