రామోజీ మరణం పీఎం సంతాపం
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి
న్యూఢిల్లీ – ఈనాడు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు . దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. శనివారం ఆయన ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు మోడీ.
ఆయన నిత్యం అభివృద్ది గురించి చర్చించే వారని, తనతో కలిసిన సమయంలో కూడా ఇదే చెప్పారంటూ గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి ఈ సందర్భంగా. రామోజీ మరణం తెలుగు వారికి తీరని నష్టమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పత్రికా రంగంలో, వ్యాపార రంగాలలో తనదైన ముద్ర వేశారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన చరిత్ర రామోజీరావుది.