సీతారాం ఏచూరి మృతి బాధాకరం
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఢిల్లీ – తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో గురువారం కన్ను మూశారు సీపీఎం సీనియర్ నాయకుడు సీతారాం ఏచూరి. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ.
ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలిపారు. ఆయనతో తనకు అత్యంత సన్నిహిత సంబంధం ఉందన్నారు. ఇద్దరి మధ్య దేశానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావనకు వచ్చాయని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు ప్రధానమంత్రి.
ఇదిలా ఉండగా సీతారాం ఏచూరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ. ఆయన పూర్తి పేరు ఏచూరి సీతారామారావు. ఆగస్టు 12, 1952 లో తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టారు.
. 1975లో సీపీఎం ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న ఏచూరి.. ఉమ్మడి ఏపీ మాజీ సీఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. సీతారం ఏచూరి వయసు 72 ఏళ్లు. ఇదిలా ఉండగా మృత దేహాన్ని ఎయిమ్స్ కు విరాళంగా ఇస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
సీతారాం ఏచూరి మృతి పట్ల దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీతో పాటు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు , రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర సంతాపం తెలిపారు.