NEWSNATIONAL

రైసీ దుర్మ‌ర‌ణం మోదీ సంతాపం

Share it with your family & friends

ఆయ‌న లేక పోవ‌డం బాధాక‌రం

న్యూఢిల్లీ – హెలికాప్ట‌ర్ కూలిన ఘ‌ట‌న‌లో ఇరాన్ దేశ అధ్య‌క్షుడు ఇబ్ర‌హీం రైసీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి , ఇత‌ర ఉన్న‌త అధికారులు దుర్మ‌ర‌ణం చెంద‌డం ప‌ట్ల తీవ్ర ద‌గ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ.

వారంద‌రి ఆత్మ‌లకు శాంతి చేకూరాల‌ని కోరారు. ఇరాన్ ప్రెసిడెంట్ తో స్నేహ పూర్వ‌కంగా ఉంటూ వ‌చ్చాన‌ని తెలిపారు. భార‌త్ ఎల్ల‌ప్పుడూ ఇరాన్ దేశంతో అనుబంధం క‌లిగి ఉంద‌ని పేర్కొన్నారు పీఎం. ఇదిలా ఉండ‌గా దేశ అధ్య‌క్షుడిగా ప‌రిపాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రిచారు ఇబ్ర‌హీం రైసీ.

మహిళల దుస్తులు, ప్రవర్తనను నియంత్రించే ఇరాన్ “హిజాబ్, పవిత్రత చట్టాన్ని” కఠినంగా అమలు చేయాలని రైసీ ఆదేశించాడు. కొన్ని రోజుల కింద‌ట ఇజ్రాయెల్ పై వైమానిక దాడులు చేప‌ట్టాడు. ఇది విఫ‌లం చెందింది.

విశ్వవిద్యాలయాల ఇస్లామీకరణ, ఇంటర్నెట్ పునర్విమర్శ , పాశ్చాత్య సంస్కృతి సెన్సార్‌షిప్‌కు ప్ర‌ధాన మద్ద‌తుదారుగా ఉన్నారు ఇబ్ర‌హీం రైసీ. ఈయ‌న నాయ‌క‌త్వంలోనే ఇరాన్ పాకిస్తాన్ పై వైమానిక దాడులు నిర్వ‌హించింది.