కనకరాజు మృతి పట్ల మోడీ సంతాపం
దేశం గొప్ప కళాకారుడిని కోల్పోయింది
ఢిల్లీ – తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజు మృతి చెందడం పట్ల దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు.
కనకరాజు అద్భుతమైన నృత్యకారుడు మాత్రమే కాదని ఆయన సాంస్కృతిక దిగ్గజం అని కొనియాడారు.
కనకరాజు మృతితో దేశం గొప్ప నిబద్దత కలిగిన కళాకారుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గుస్సాడీ నృత్యాన్ని పరిరక్షించడంలో ఆయన అందించిన గొప్ప సహకారం రాబోయే తరాలను ఎల్లప్పుడూ చైతన్యవంతం చేస్తుందని అన్నారు మోడీ. అతని అంకితభావం . అభిరుచి సాంస్కృతిక వారసత్వం ముఖ్యమైన అంశాలు వాటి ప్రామాణికమైన రూపంలో వృద్ధి చెందేలా చూసిందన్నారు.
ఈ సందర్బంగా కనకరాజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు. కాగా గుస్సాడి జానపద నాట్య మాస్టర్‌ని గుస్సాడి రాజు అని కూడా పిలుస్తారు. కాగా జానపద నృత్యాన్ని ప్రోత్సహించడంలో కనకరాజు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.
ఇదే సమయంలో తెలంగాణ సంస్కృతిలో మిళితమైన జానపద గుస్సాడీ కళా రూపానికి వన్నెలద్దిన గొప్ప కళాకారుడు కనకరాజు అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.