ప్రధాని మోడీకి గయానా..డొమినికా అరుదైన గౌరవం
అత్యున్నత పురస్కారాలు అందుకున్న ప్రధానమంత్రి
ట్రినిడాడ్ – భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం లభించింది. ఆయన ప్రస్తుతం గయానాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా ఘన స్వాగతం లభించింది. మోడీకి గయానా, డొమినికా , బార్బాడోస్ లు అత్యున్నత పురస్కారాన్ని అందజేశారు. దీంతో ప్రధానమంత్రికి దక్కిన అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 19కి చేరుకుంది.
తాజాగా (ఎల్) గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీచే గయానా దేశానికి సంబంధించిన అత్యున్నత జాతీయ పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సత్కరించారు.
అంతే కాకుండా ఆర్ డొమినికా అధ్యక్షుడు పీఎంకు అత్యున్నత జాతీయ పురస్కారం డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ ను అందజేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషికి , ప్రపంచ సమాజానికి ఆయన చేసిన విశేషమైన ప్రయత్నానికి గాను ఈ అవార్డులకు నరేంద్ర మోడీని ఎంపిక చేయడం జరిగిందని గయానా, డొమినికా దేశాల అధిపతులు ప్రకటించారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా గయానాలో ఉన్న ప్రధానికి గయానీస్ అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అవార్డును ప్రదానం చేశారు.
“గయానా అత్యున్నత గౌరవం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను తనకు ప్రదానం చేసినందుకు రాష్ట్రపతి డాక్టర్ ఇర్ఫాన్ అలీకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది భారతదేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు గుర్తింపు” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ప్రధాని మోడీ.