ఏపీ అభివృద్దికి తోడ్పాటు అందిస్తాం
స్పష్టం చేసిన పీఎం నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని టీడీపీ, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూటమికి భారీ ఎత్తున విజయాన్ని కట్ట బెట్టినందుకు స్పందించారు. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
తాము ఊహించని రీతిలో కూటమిని ఆంధ్ర ప్రజలు ఆదరించారని కొనియాడారు. మీరందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు మోడీ. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్దికి అన్ని విధాలుగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందజేస్తామని వెల్లడించారు.
ఈ సందర్బంగా నభూతో నభవిష్యత్ అన్న రీతిలో తీర్పు చెప్పినందుకు, అనూహ్యమైన ఫలితాలను సాధించినందుకు చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ లను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నట్లు పేర్కొన్నారు మోడీ.