NEWSNATIONAL

చెన్న ప‌ట్ట‌ణం అద్భుతం – మోదీ

Share it with your family & friends

నా జీవితంలో మ‌రిచి పోలేను

త‌మిళ‌నాడు – ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోదర దాస్ మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా కె. అన్నామ‌లై సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర రాజ‌ధాని చెన్నై న‌గ‌రంలో భారీ ఎత్తున రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అశేష జ‌న వాహిని ఆయ‌న‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికింది. రోడ్డుకు ఇరు వైపులా వెల్ క‌మ్ చెప్పారు. ఊహించ‌ని రీతిలో జ‌నం హాజ‌రు కావ‌డంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు ప్ర‌ధాన‌మంత్రి మోదీ.

చెన్న ప‌ట్ట‌ణం అంతా కాషాయ‌మ‌యం కావ‌డంతో తెగ సంతోషానికి లోన‌య్యారు . ఈ సంద‌ర్బంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా మోదీ త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకున్నారు. ఫోటోల‌ను షేర్ చేశారు. ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి. తాను ఊహించ‌ని రీతిలో త‌మిళ వాసులు ఆద‌రించార‌ని వారిని ఎల్ల‌ప్ప‌టికీ మ‌రిచి పోలేనంటూ పేర్కొన్నారు.

చెన్నై న‌గ‌రం అద్భుతం. మ‌హా అద్భుతంగా తోచింద‌న్నారు. ఇది నాలో మ‌రింత ఉత్సాహాన్ని నింపింద‌ని, ఇక మీరు చెప్పిన స్వాగ‌తం చూస్తే బీజేపీ మ‌రోసారి దేశ‌మంత‌టా కాషాయ జెండాను ఎగుర వేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కు క‌లుగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు.