ఎన్నికల పండుగ వచ్చేసింది
సుస్థిర పాలనకు పట్టం కట్టండి
న్యూఢిల్లీ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్బంగా స్పందించారు ప్రధానమంత్రి.
ఆదివారం ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత దేశమని పేర్కొన్నారు. ఎన్నికలంటే ఓ పండుగ వాతావరణం నెలకొంటుందన్నారు. తాను పీఎంగా వచ్చాక దేశంలో అనేక మార్పులు తీసుకు వచ్చానని స్పష్టం చేశారు. ఇవాళ మనతో పోటీ పడేందుకు ఇతర దేశాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు.
శాస్త్ర, సాంకేతిక, ఐటీ రంగాలలో భారత్ దూసుకు పోతోందన్నారు. ప్రత్యేకించి ఐటీ పరంగా శాసించే స్థాయికి భారతీయులు చేరుకున్నారని ఇదంతా సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం ఉండడం వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో 98 కోట్ల మంది భారతీయులు తమ విలువైన ఓటు ఉపయోగించ బోతున్నారని, మరోసారి తనను ఆశీర్వదించాలని నరేంద్ర మోదీ కోరారు.