Saturday, April 19, 2025
HomeSPORTSఖోఖో మ‌హిళా జ‌ట్టుకు మోడీ కంగ్రాట్స్

ఖోఖో మ‌హిళా జ‌ట్టుకు మోడీ కంగ్రాట్స్

మీ విజ‌యం దేశానికి స్పూర్తి దాయ‌కం

ఢిల్లీ – మొట్టమొదటి ఖో ఖో ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా జట్టుకు అభినందనలు తెలిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఈ చారిత్రాత్మక విజయం వారి అసమాన నైపుణ్యం, దృఢ సంకల్పానికి ప్ర‌తీకగా నిలిచింద‌న్నారు.

ఈ అసాధార‌ణ‌మైన గెలుపు భారతదేశపు పురాతన సాంప్రదాయ క్రీడలలో ఒకదానికి మరింత గుర్తింపు తెచ్చి పెట్టేలా చేసింద‌న్నారు. దేశ వ్యాప్తంగా లెక్కలేనంత‌మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిచ్చింద‌ని తెలిపారు పీఎం. రాబోయే కాలంలో మరింత మంది యువకులు ఈ క్రీడను కొనసాగించడానికి మార్గం సుగమం చేసింద‌న్నారు.

కాగా తొలిసారిగా జ‌రిగిన ఖో ఖో ప్ర‌పంచ క‌ప్ ను భార‌త మ‌హిళ‌లు గెలుచుకున్నారు. ఫైన‌ల్ మ్యాచ్ లో నేపాల్ ను ఓడించి రికార్డ్ సృష్టించారు. వీరితో పాటు పురుషుల ఖోఖో టీం కూడా చ‌రిత్ర సృష్టించింది. ఈ జ‌ట్టు కూడా విజేత‌గా నిలిచింది. క‌ప్ స్వంతం చేసుకుంది. నేపాల్ ను 78-40 తేడాతో ఓడించారు. టోర్నీ మొత్తంగా భార‌త జ‌ట్టు ఏ ఒక్క మ్యాచ్ కూడా ఓడి పోకుండా అజేయంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments